India, US Call on Taliban to Adhere to Commitments | తాలిబన్లకు పలు సూచనలు చేసిన భారత్, అమెరికా

Share this & earn $10
Published at : September 29, 2021

అఫ్గానిస్తాన్ లో పరిపాలన విషయంలో తాలిబన్లు వారు ఇచ్చిన హామీలు అన్నింటికీ కట్టుబడి ఉండాలని........ భారత్ , అమెరికా సూచించాయి. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ తర్వాత...... ఇరు దేశాలూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మహిళలు, చిన్నారులు, మైనార్టీలు సహా మానవ హక్కులను తాలిబన్లు కాపాడాలని సూచించాయి. మరో దేశాన్ని బెదిరించడానికి లేదా దాడి చేయడానికి అఫ్గాన్ ..... కేంద్రంగా మారకుండా ఆ దేశ కొత్త పాలకులు చూడాలని సూచించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ఉండడం లేదా వారికి శిక్షణ ఇవ్వకుండా అఫ్గాన్ గడ్డను మార్చాలని తాలిబన్లకు ఈ సంయుక్త ప్రకటనలో భారత్ , అమెరికా సూచించాయి. ఈ దిశగా రూపొందించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని తాలిబన్లు పాటించాలని స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదంపై పోరాటానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సంయుక్త ప్రకటనలో మోదీ, బైడెన్ ప్రధానంగా ప్రస్తావించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించిన భారత్ , అమెరికా....ఐరాస గుర్తించినవి సహా అన్ని ఉగ్రవాద సంస్ధలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. 2008 ముంబయి దాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చాయి.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- India, US Call on Taliban to Adhere to Commitments | తాలిబన్లకు పలు సూచనలు చేసిన భారత్, అమెరికా
ETVETV TeluguETV NewsVideo